సామాజిక బాధ్య‌త‌కు చిరునామా ‘ట్యూట‌ర్స్ ప్రైడ్’

 

వ్యాపారం చేయ‌డం.. లాభాల‌ను సాధించ‌డం… కార్పోరేట్ రంగంలో ప్ర‌తీ కంపెనీ ప్ర‌ధాన ల‌క్ష్యం ఇదే. అయితే లాభార్జ‌నే ద్యేయంగా ప‌నిచేసే కొన్ని కంపెనీలు ఆ లాభాల వేట‌లో ప‌డి సామాజిక బాధ్య‌త‌ను విస్మ‌రిస్తాయి. పూర్తి స్థాయి వ్యాపార సంస్థ‌లుగా మారిపోయాక సామాజిక సేవ‌, బాధ్య‌త‌ల‌ను గాలికొదిలేస్తాయి. అయ‌తే కొన్ని సంస్థ‌లు మాత్రం ప్రారంభం నుంచి వ్యాపార ల‌క్ష్యాన్ని సాధిస్తూనే కీల‌కమైన సామాజిక బాధ్య‌త‌ను మాత్రం మ‌ర్చిపోకుండా నెర‌వేరుస్తూ ఉంటాయి. పురుడు పోసుకుని రెండేళ్లే అవుతున్నా సామాజిక బాధ్య‌త‌లో మాత్రం రెండు ద‌శాబ్దాల కంపెనీల‌కు ధీటుగా నిల‌బ‌డుతోంది ట్యూట‌ర్స్ ప్రైడ్.

 

 

ఆన్ లైన్ ట్యూట‌రింగ్, ఆన్ లైన్ త‌ర‌గ‌తులు అందించే సంస్థ‌గా ప్ర‌స్థానం ప్రారంభించిన ట్యూట‌ర్స్ ప్రైడ్ విద్యా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ప్రారంభించి ఇంకా రెండేళ్లు పూర్తి కాకుండానే ట్యూట‌ర్స్ ప్రైడ్ లో ప్ర‌స్తుతం 6 ల‌క్ష‌ల మంది ట్యూట‌ర్లు రిజిష్ట‌ర్ అయ్యారు. ఇది ఆన్ లైన్ ట్యూట‌రింగ్ రంగంలో ఒక న‌యా విప్ల‌వం అని చెప్పొచ్చు. అలాగే దాదాపు 50 వేల మంది విద్యార్ధులు ట్యూట‌ర్స్ ప్రైడ్ లో త‌మ పేరును రిజిష్ట‌ర్ చేసుకున్నారు. ట్యూట‌ర్స్ ప్రైడ్ లో ఒక విశిష్ఠ‌త‌, ప్ర‌త్యేకత ఏంటంటే ఇందులో దాదాపు 6500 కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అక‌డమిక్ తో పాటు నాన్ అక‌డ‌మిక్ లో ఎటువంటి కోర్సును అయినా నేర్చుకునేందుకు ట్యూట‌ర్స్ ప్రైడ్ లో ట్యూట‌ర్స్ అందుబాటులో ఉన్నారు.

 

 

రెండేళ్ల‌లో ఇన్ని ఘ‌న‌త‌లు సాధించిన ట్యూట‌ర్స్ ప్రైడ్ ఒకవైపు త‌న కార్య‌క‌లాపాల‌ను విస్త‌రిస్తూనే మ‌రోవైపు ప‌లు సామాజిక కార్య‌కలాపాల‌ను నిర్వ‌హిస్తోంది.సామాజిక మార్పుకు శ్రీకారం చుట్టే సంస్కృతి ప‌రిర‌క్ష‌ణ‌, మ‌హిళా సాధికార‌త‌, విద్య, వైద్యంపై దృష్టి సారించి ఆయా కార్య‌క్ర‌మాల‌కు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. అత్యుత్త‌మ టీచ‌ర్ల‌ను స‌త్క‌రించే ఐటాప్ అవార్డుల కార్య‌క్ర‌మానికి గ‌డిచిన రెండేళ్లుగా ట్యూట‌ర్స్ ప్రైడ్ ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అలాగే ఈ ఏడాది భారీ ఎత్తున నిర్వ‌హించిన లేడీ లెజెండ్స్ అవార్డు కార్య‌క్ర‌మానికి కూడా ప్ర‌ధాన స్సాన్స‌ర్ ట్యూట‌ర్స్ ప్రైడ్ సంస్థే. అలాగే ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌ను, స్పార్ట‌ప్ ల‌ను ప్రోత్సహించేందుకు నిర్వ‌హిస్తున్న వ‌ర్క్ షాప్ ల‌కు కూడా ఆర్థిక స‌హాయాన్ని చేస్తోంది.

 

 

వ‌చ్చే రెండేళ్ల‌లో ప్ర‌తీ ఇంటికీ విస్త‌రించాల‌ని ట్యూట‌ర్స్ ప్రైడ్ భావిస్తోంది. ప్ర‌తీ పిల్ల‌వాడు, ప్ర‌తీ త‌ల్లిదండ్రుల‌కు ట్యూష‌న్ లేదా ప్ర‌త్యేకమైన శిక్ష‌ణ కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు ట‌క్కున గుర్తుకు వ‌చ్చే సంస్థ‌గా రూపాంత‌రం చెందాల‌ని ట్యూట‌ర్స్ ప్రైడ్ యాజ‌మాన్యం ల‌క్ష్యం. పిల్ల‌ల భ‌ద్ర‌తే ప్ర‌ధాన అజెండాగా అదే స‌మ‌యంలో నాణ్య‌మైన ట్యూట‌ర్స్ ను అందించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకుంది. అందుకోసం ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూల‌ను నిర్వ‌హించి ఆ త‌ర్వాత మాత్ర‌మే ట్యూట‌ర్స్ ను రిక్రూట్ చేసుకుంటోంది. అటు వ్యాపారంలోనూ ఇటు సామాజిక బాధ్య‌త‌లోనూ దూసుకుపోతున్న ట్యూట‌ర్స్ ప్రైడ్ కు ‘కెరీర్ టైమ్ ఆన్ లైన్’ ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది.