ఉదయాన్నే హడావుడిగా నిద్ర లేవడం, గబా గబా తయారై ట్రాఫిక్ లో ఆఫీస్ కు చేరుకోవడం అక్కడ ఓ 8 గంటలు పనిచేసి సాయింత్రం ఏడుకి మళ్లీ ఇంటికి చేరడం. ఇలా ప్రతీ రోజూ చేసే రోటీన్ జాబ్స్ ను ఈతరం ఇష్టపడటం లేదు. అధిక శాతం మంది 9 టు 5 జాబ్స్ కాకుండా కాస్త భిన్నంగా ఉంటే జాబ్స్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా తమకు నచ్చినప్పుడు మాత్రమే పనిచేసే వీలున్న జాబ్స్ ను చాలా మంది కోరుకుంటున్నారు. ఈ విధంగా ఆలోచించే వారి కోసం ప్రజంట్ జాబ్ మార్కెట్లో ఎన్నో జాబ్స్ సిద్ధంగా ఉన్నాయి. అనుకున్న సమయానికి టాస్క్ ను పూర్తి చేయగలిగితే చాలు వీరు ఏం టైం లో పనిచేస్తున్నారు? ఎంత సేపు పనిచేస్తున్నారు అని ఎవరూ అడగరు. రోటీన్ కు భిన్నంగా కూల్ గా జాబ్ చేయాలనుకునే వారి కోసం చాలా జాబ్స్ రెడీగా ఉన్నాయి. మన ‘కెరీర్ టైమ్స్’ లో ఇప్పుడు అటువంటి జాబ్స్ కోసం తెలుసుకుందాం.
ఫ్రీలాన్స్ వెబ్ డిజైనర్
సోషల్ మీడియా కన్సల్టెంట్
పర్సనల్ ట్రైనర్
రియల్ ఎస్టేట్ ఏజెంట్
ట్యాక్స్ కన్సల్టెంట్
ప్రస్తుతం ఉద్యోగుల్లో చాలా మందికి పన్నులకు సంబంధించిన విషయాలపై అంతగా అవగాహన ఉండదు. ఎంత ఆదాయం వస్తే ఎంత పన్ను చెల్లించాలి? పన్నుల భారం పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పద్ధతులను అనుసరిస్తే పన్ను భారం అనిపించదు? వంటి విషయాలను తెలియజెప్పేందుకు నిపుణుల అవసరం పడింది. అలాంటి అవసరం లోంచి పుట్టుకొచ్చిందే ట్యాక్స్ కన్సల్టెంట్ కెరీర్. ప్రస్తుతం చాలా మంది వ్యక్తులు, సంస్థలు తమ పన్ను సంబంధిత వ్యవహారాలను ఔట్ సోర్సింగ్ చేస్తున్నాయి. సమయం లేకపోవడం వలన వీరు ఆ బాధ్యతలను ట్యాక్స్ కన్సల్టెంట్ కు అప్పగిస్తారు. వీరు ఉద్యోగికి అనుకూలమైన సమయంలో వాళ్లను కలిసి వివరాలు సేకరించి ఏ విధంగా చేయాలి? ఎలా చేయాలి? అన్న విషయాలపై ఒక ప్రణాళిక తయారు చేస్తారు. వారికి తగిన గైడెన్స్ ఇస్తారు. ట్యాక్స్ కన్సల్టెంట్ గా పేరు సాధిస్తే నెలకు 30 నుంచి 40 వేల వరకూ ఆదాయం సంపాదించేందుకు అవకాశం ఉంది.