అక్టోబ‌ర్ 2 న‌ ప్ర‌తిష్టాత్మ‌క టీచింగ్ అవార్డుల కార్య‌క్ర‌మం ITAP-2018

 

 

 

  • ఉత్త‌మ ఉపాధ్యాయుల‌కు అద్భుత అవ‌కాశం
  • నామినేష‌న్ల ప్ర‌క్రియ జ‌రుగుతోంది
  • దేశంలోనే అత్యుత్త‌మ టీచ‌ర్స్ అవార్డుల కార్య‌క్ర‌మం
  • బెస్ట్ టీచ‌ర్స్ ను ఒక‌చోట క‌లిపే అద్భుత వేదిక
  • 7 స్టార్ హోట‌ల్ లో రాజ‌కీయ‌, సినీ, పారిశ్రామిక‌ ప్ర‌ముఖల‌తో అవార్డుల ప్ర‌ధానం

 

ఉపాధ్యాయుడు ఒక విద్యార్ధి భ‌విష్య‌త్ ను తీర్చిదిద్దే మార్గ‌ద‌ర్శ‌కుడు. ఒక మ‌నిషి త‌ల్లిదండ్రుల త‌ర్వాత పూజించాల్సింది గురువునే. జీవితాంతం సేవ చేసుకున్నా మ‌నం మ‌న గురువు రుణం తీర్చుకోలేము. ప్ర‌త్య‌క్ష దైవం లాంటి గురువును గౌర‌వించుకునే, గుర్తుచేసుకునే సంప్ర‌దాయం మెల్ల‌గా క‌నుమ‌రుగవుతోంది. కార‌ణాలు ఏమైతే కానీ గురువుకు గుర్తింపు ఉండ‌టం లేదు..గౌర‌వం ఉండ‌టం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో గురువు యొక్క గొప్ప‌త‌నాన్ని నేటి త‌రానికి చాటిచెప్పి, అత‌న్ని గౌర‌వించుకునే స‌త్సాంప్ర‌దాయానికి శ్రీకారం చుట్టింది. రాజా ర‌త్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్. ఐడియల్ టీచింగ్ అవార్డ్ ప్రొగ్రామ్ పేరిట ప్ర‌తీ ఏటా మంచి ప‌నితీరు క‌న‌బ‌ర్చిన టీచ‌ర్ల‌ను అవార్డుల‌తో స‌త్క‌రిస్తోంది. రాజా ర‌త్న హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేష‌న‌ల్ ట్ర‌స్ట్ చేస్తున్న ఈ గొప్ప కార్య‌క్ర‌మాన్ని చూసి ట్యూట‌ర్ ప్రైడ్ సంస్థ ఈ అవార్డుల కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన స్పాన్స‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

 

 

 

 

ఈ ఏడాదికి గాను అక్టోబ‌ర్ 2 న‌ ఈ అవార్డుల కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు. దేశంలోనే తొలిసారిగా టీచ‌ర్స్ కోసం ప్ర‌త్యేకంగా నిర్వ‌హిస్తున్న ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ టీచ‌ర్ పాల్గొనాల్సిందిగా అవార్డు నిర్వాహ‌కులు కోరుతున్నారు. ఒక్క అక‌డ‌మిక్ టీచ‌ర్స్ మాత్ర‌మే కాకుండా నాన్ అక‌డ‌మిక్ టీచ‌ర్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. మ‌న రెండు తెలుగు రాష్ట్రాల‌తో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి టీచ‌ర్స్ ఈ కార్య‌క్ర‌మానికి వ‌స్తున్నారు. ఫ్రొఫెస‌ర్స్ ద‌గ్గ‌ర్నుంచి డీన్ లు, ప్రిన్సిప‌ల్స్ , యోగా టీచ‌ర్స్ , అక‌డ‌మిక్ టీచ‌ర్స , లెక్చ‌ర‌ర్స్ ఇలా అన్ని విభాగాల నుంచి టీచ‌ర్స్ ఇందులో పాల్గొంటారు. ఆలోచ‌న‌ల‌ను క‌ల‌బోసుకునేందుకు, అభిప్రాయాల‌ను పంచుకునేందుకు అదే స‌మ‌యంలో మీ ప్ర‌తిభను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసే ఒక ప్రతిష్ఠాత్మ‌క అవార్డును అందుకునేందుకు ఇదో అద్భుత అవకాశం. ఇప్పుడే నామినేష‌న్ వేయండి.

 

ఇప్ప‌డే సంప్ర‌దించండి.

 

Website :  www.itapawards.com

Email  :  itapawards@gmail.com

Mobile : +91-7396583407 , 8247367450

 

అవార్డుల జ్యూరీ

 

 

 

అవార్డుల కార్య‌క్ర‌మం షెడ్యూల్

 

       

 

 

వేదిక

ట్రైడెంట్ హోట‌ల్, మాదాపూర్, హైద‌రాబాద్ 

 

 

 

 

 

ఈ ప్రతిష్టాత్మ‌క ఈవెంట్ లో పాల్గొన‌డం వ‌ల‌న ప్ర‌యోజ‌నాలు

 

1. దేశంలోనే అత్యుత్త‌మ అవార్డును సాధించే వీలు.
2. తెలుగు మీడియాతో పాటు నేష‌న‌ల్ మీడియా క‌వ‌రేజీ
3. మీ రంగాల్లో ఉన్న ఇత‌ర ఉపాధ్యాయుల‌ను, ప్ర‌ముఖుల‌ను క‌లుసుకునే అవ‌కాశం
4. మీ ప్ర‌తిభ‌ను వెల్ల‌డి చేస్తూ, మీ సేవ‌ల‌ను గుర్తింపు
5. మీ వంటి అభిరుచులు ఉన్న వ్య‌క్తుల‌ను క‌లుసుకోవ‌డం
6. అన్నింటికంటే ముఖ్యంగా ఎంద‌రో ప్ర‌ముఖుల సమ‌క్షంలో అవార్డును అందుకునే ఒక మ‌ధుర జ్ఞాప‌కం

 

Ticket Pricing

 

 

పాస్ ల కోసం ఈ క్రింది వెబ్ లింక్ ల‌ను క్లిక్ చేయండి.

 

www.itapawards.com

https://www.meraevents.com/event/itapawards

 

(Please note that all payments are processed, and pass is non-refundable. It is advised to books the tickets at the earliest.)

మీరు “ది బెస్ట్” అవునో, కాదో తెలుసుకోవాలంటే ఇది చదవండి!!

 

 

బీ ద బెస్ట్..ఇది విన‌డానికి చిన్న ప‌ద‌మే కావొచ్చు. కానీ దీన్ని అందుకోవాల‌న్నా..దీన్ని సాధించాల‌న్నా ఎంతో కృషి , ప‌ట్టుదల కావాల్సి ఉంటుంది. అన్నింట్లోనూ అత్యుత్తంగా ఉండాలంటే మ‌నం చేసే ప‌నులు, మ‌న ప్ర‌వ‌ర్త‌న‌, మ‌న న‌డ‌వ‌డిక ఇలా అన్నీ ఎంతో బాధ్య‌త‌, నాణ్య‌త‌తో కూడి ఉండాలి. వీట‌న్నింటికి తోడు నిజాయితీ ఉండాలి. చేసే ప‌నిలో నిజాయితీ ఉంటే దాని నుంచి వ‌చ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఒక విద్యార్ధి అయినా, ఉద్యోగి అయినా లేదా వ్యాపార‌వేత్త అయినా ద బెస్ట్ గా ఎదాగ‌లంటే ఎన్నో ల‌క్ష‌ణాల‌ను, అర్హ‌త‌ల‌ను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంటుంది. బెస్ట్ గా ఎదగాలంటే ముందుగా మీరు ఎదుటివారికి ద బెస్ట్ ఇవ్వ‌డానికి ప్ర‌య‌త్నం చేయాలి. మీ కుటుంబ స‌భ్యులు, మీ సహోద్యోగులు, మీ కింద ప‌నిచేసే వారు, మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, మీ తోటివారు ఇలా ఎవ‌రికైనా అత్యుత్త‌మైన‌ది ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డిన‌ప్పుడు మాత్ర‌మే మీరు బెస్ట్ గా ఎదుగుతారు.

 

 

బాధ్య‌త అంటే అత్యుత్త‌మ‌మైన‌ది అందించ‌డ‌మే!!

 

ఒక తండ్రి త‌న పిల్ల‌ల‌కు మంచి భ‌విష్య‌త్ ను అందించాలంటే వాళ్ల‌కు అత్యుత్త‌మైన స‌దుపాయాలు క‌ల్పించాలి. మంచి స్కూల్, మంచి పెంప‌కం, మంచి తిండి, మంచి ప్ర‌వ‌ర్త‌న అందించ‌గ‌లిగితే వారు ది బెస్ట్ పౌరులుగా ఎదుగుతారు. కెరీర్ ప‌రంగా, ప్ర‌వ‌ర్త‌న ప‌రంగా, సామాజిక ప‌రంగా అత్యున్న‌తమైన వ్య‌క్తులుగా త‌యార‌వుతారు. ఇక్క‌డ ఇంకో అద్భుత‌మైన విష‌యం దాగుంది. తండ్రి త‌న పిల్ల‌ల‌కు ది బెస్ట్ పెంప‌కం అందించిన‌ప్పుడు దాన్ని అందిపుచ్చుకుని వాళ్లు మంచి పౌరులుగా ఎదిగిన‌ప్పుడు వారు కూడా వాళ్ల పిల్ల‌ల‌తో పాటు స‌మాజానికి అదే విధ‌మైన విలువ‌లు, బాధ్య‌త అందిస్తారు. ఒక ప‌ని చేసినప్పుడు విలువ‌లు, నాణ్య‌త‌, నిజాయితీతో కూడిన ప‌రంప‌ర‌ను కొన‌సాగిస్తారు. దీని వ‌ల‌న వారు ఎవ‌రికి మేలు చేసినా అది అత్యుత్త‌మంగా, మంచిదిగా ఉంటుంది. దాని వ‌ల‌న అవ‌త‌లి వ్యక్తుల‌కు మేలు జ‌ర‌గ‌డ‌మే కాకుండా వీరు కూడా త‌మ అత్యుత్త‌మ ప్ర‌వ‌ర్త‌న‌తో స‌మాజంలో , త‌మ వ్యాపారంలో, ఉద్యోగ జీవితంలో ఉన్న‌తంగా ఎదుగుతారు.

 

 

ఇవ్వ‌డం నేర్చుకుంటే నీకు అన్నీ వ‌స్తూనే ఉంటాయ్!!

 

ఇప్పుడు మ‌న స‌మాజంలో చాలా మందికి ఇవ్వ‌డం అనేది అస్స‌లు తెలీడం లేదు. నేను క‌ష్ట‌ప‌డి సంపాదించాను నేను ఎందుకు ఇవ్వాలి? నేనెందుకు స‌హాయ చేయాలి? అన్న ధోర‌ణి మ‌నుష్యుల్లో పెరిగిపోతోంది. ఇది చాలా త‌ప్పు. మ‌న ద‌గ్గ‌ర ఉన్న‌దాంట్లో మ‌న సంక్షేమానికి త‌గిన మొత్తాన్ని అట్టిపెట్టుకున్న త‌ర్వాత మిగిలిన దాంట్లో కొంత మొత్తాన్ని ఆప‌ద‌లో, అవ‌స‌రంలో ఉన్న‌వారికి ఇవ్వ‌గ‌లిగితే మ‌న వ్య‌క్తిత్వ నిర్మాణంలో ఎంతో మార్పు వ‌స్తుంది. ఎందుకంటే ఇలా ఆప‌ద‌లో ఉన్న మీ పొరుగువారికో, మీ సహోద్యోగికో, మీ కింద ప‌నిచేసే వారికో మీకు చేత‌నైనంత స‌హాయం చేస్తే అది ఎంతో ఆత్మ సంతృప్తిని అందిస్తుంది. ఇలా ఇవ్వ‌డం వ‌ల‌న మీకు వ‌స్తూనే ఉంటుంది అన్న విష‌యాన్ని ఎప్పుడూ మ‌ర్చిపోకండి. ఎందుకంటే ఒక మంచి స‌దుద్దేశ్యంతో, నిజాయితీగా, మ‌న‌స్ఫూర్తిగా మీరు స‌హాయం చేసిన‌ప్పుడు ప్ర‌కృతి మీకు అంత‌కు రెట్టింపు సంప‌ద‌ను అందిస్తుంది. ఇది సృష్టిలో ఉన్న ఒక అద్భుత‌మైన విష‌యం. కాబ‌ట్టి ఎప్పుడూ మీకు స‌హాయం చేసే శ‌క్తి, అవ‌కాశం ఉన్న‌ప్పుడు క‌చ్చితంగా ఇత‌రుల‌కు స‌హాయం చేయండి. ఒక‌సారి త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కు అర్జెంట్ 20 ల‌క్ష‌ల అవ‌సరం పడింది. ఎంత సూప‌ర్ స్టార్ అయినా స‌మ‌యానికి డ‌బ్బులు లేక‌పోతే ఎవ‌రినో ఒక‌రిని స‌హాయం కోరాల్సిందే. బ్యాంకు ఖాతాలు, ఇంట్లో ఉన్న బీరువాలు అన్నీ గాలిస్తే 16 ల‌క్ష‌లు స‌మ‌కూరాయి. ఇంకో 4 ల‌క్ష‌లు కావాల్సి ఉంది. స్నేహితుల‌కు ఫోన్ చేస్తే ఒకట్రెండు రోజులు స‌మ‌యం ఇస్తే నాలుగు ల‌క్ష‌లు స‌మ‌కూరుస్తామ‌ని చెప్పారు. ఇంత‌లో ర‌జ‌నీ చిన్న‌నాటి స్నేహితుడు అత‌ని ఇంటికి వ‌చ్చాడు. మా అమ్మాయి పెళ్లి రెండురోజుల్లో ఉంది. ఒక ల‌క్ష రూపాయ‌లు అవ‌స‌రం ప‌డింది. ఎలాగైనా నువ్వే స‌ర్దాలి అని ర‌జ‌నీని అడిగాడు. రజ‌నీకాంత్ వెంట‌నే త‌న ద‌గ్గ‌ర ఉన్న 16 ల‌క్ష‌ల్లో ఒక ల‌క్ష రూపాయ‌ల తీసి త‌న స్నేహితుడికి ఇచ్చి అమ్మాయి పెళ్లి ఘ‌నంగా చేయి అని పంపించాడు. ర‌జ‌నీ చేసిన ప‌నికి అత‌ని భార్య కాస్త నొచ్చుకుంద‌ట‌. మ‌న‌మే ఇప్పుడు డ‌బ్బు అవ‌స‌రం ప‌డి అంద‌ర్నీ అడిగాం. ఇప్పుడు మీరు ఈ స‌హాయం చేయ‌డం అవ‌స‌ర‌మా? అని అడిగింది. దానికి ర‌జ‌నీ నేను ల‌క్ష రూపాయ‌ల స‌హాయం చేస్తే నా స్నేహితుడు ప‌ని సంపూర్ణంగా పూర్త‌వుతుంది. అత‌ను సంతోషంగా ఉంటాడు. నేను నాలుగు ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్నాను. ఈ క్ష‌ణం నుంచి 5 ల‌క్ష‌ల కోసం ప్ర‌య‌త్నిస్తాను. పెద్ద తేడా లేదు. కాబ‌ట్టి స‌హాయం చేయ‌డంలో నాకు వెసులుబాటు ఉంది అందుకే చేసాను అని చెప్పాడు. ఇటువంటి వ్య‌క్తిత్వ నిర్మాణం చేసుకున్నాడు క‌నుక‌నే అత‌ను నిజ‌జీవితంలోనూ సూప‌ర్ స్టార్ అయ్యాడు. ఇప్పుడు మ‌న స‌మాజానికి అలాంటి సూప‌ర్ స్టార్ లు కావాలి.

 

 

చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిజాయితీ ఉండాలి!

 

మీరు ఒక కంపెనీలో ప‌నిచేస్తున్నారు. ప‌ర్య‌వేక్ష‌ణ లేన‌ప్పుడు ప‌నిచేయ‌కుండా త‌ప్పించుకోవ‌డం, ఏదో చేస్తున్నాం లే అన్న ధోర‌ణిలో ఉండ‌టం వంటివి అస్స‌లు చేయ‌కండి. ఎందుకంటే ఇటువంటి వైఖ‌రి మీ కెరీర్ ను దారుణంగా దెబ్బ‌తీస్తుంది. ఎందుకంటే చేస్తున్న ప‌నిలో నాణ్య‌త, నిబ‌ద్ధ‌త లేక‌పోతే ఆ కంపెనీ వ‌దిలి వేరే కంపెనీకి వెళ్లిన‌ప్పుడు మీ ప‌నితీరు దారుణంగా దెబ్బ‌తిని ఉంటుంది. మీరు ప‌నిచేస్తున్న సంస్థ‌, లేదా య‌జ‌మాని మీకు న‌చ్చ‌ని విధంగా ఉన్న‌ప్ప‌టికీ మీ ప‌నితీరులో ఎటువంటి తేడా ఉండ‌కూడ‌దు. న‌చ్చ‌ని చోటు నుంచి వెళ్లిపోవాలి కానీ ప‌ని చేయ‌డం మానేయ‌డం, నిజాయితీగా లేక‌పోవ‌డం వంటి చేస్తే అది మీ వ్య‌క్తిత్వాన్ని, మీ ఉద్యోగ జీవితాన్ని దెబ్బ‌తీస్తుంది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్లు తమ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్న వాళ్లు విష‌యంలో నిజాయితీగా ఉండాలి. వారికి ఎటువంటి ఆప‌ద వ‌చ్చినా ఆదుకునేందుకు రెడీగా ఉండాలి. అలాగే నిబ‌ద్ధ‌త‌, ప‌నితీరు న‌చ్చ‌ని ఉద్యోగుల‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. వాళ్ల‌ను త‌క్ష‌ణ‌మే వ‌దిలించుకోండి. బెస్ట్ ఇవ్వ‌డానికి ట్రై చేస్తే మీకు ఎప్పుడూ బెస్ట్ ఇవ్వ‌డానికి దేవుడు ట్రై చేస్తూ ఉంటాడు. కాబ‌ట్టి ఉద్యోగ జీవితంలో అయినా వ్యాపారంలో అయినా ఎప్పుడూ చేస్తున్న ప‌నిలో నిజాయితీ, నిబ‌ద్ధ‌త చూపిస్తూ, ఆప‌ద‌లో ఉన్నవారిని ఆదుకునేందుకు మీ ప‌రిధి మేర‌కు ప్ర‌య‌త్నం చేస్తే వ్య‌క్తిగా మంచి స్థితికి చేరుకుంటారు. మంచి చేయ‌కున్నా ఫ‌ర్వాలేదు ఎవ‌రికైనా చెడు చేయాల‌న్న తలంపు వ‌స్తే అది గోడ‌కు కొట్టి బంతిలా రెట్టింపు వేగంతో మీ వైపుకు వ‌స్తుంది. మీకే చెడు జ‌రుగుతుంది. అటువంటి ప్ర‌తికూల త‌పంపులు ఎప్పుడూ మ‌న‌కు మేలు చేయ‌వు.

 

 

విత్త‌నం నాటిన వెంట‌నే ఫ‌లాలు రావు!!

 

పూర్వం ఒక రాజ్యంలో రాజుగారు వేట‌కు వెళ్లి బాగా అలిసిపోయి దాహంతో నీళ్ల కోసం అన్వేషిస్తున్నారు. చాలా సేపు తిరిగిన త‌ర్వాత ఒక బాట ప‌క్క‌న మామిడి టెంక‌లు నాటుతున్న వృద్ధుడు క‌నిపించాడు. రాజును చూసిన వెంట‌నే వృద్ధుడు అత‌ని ఒక చెట్టు కింద‌కు తీసుకెళ్లి దాహం తీర్చుకోవడానికి నీళ్లు ఇచ్చాడు. నీళ్లు తాగాక కాస్త స్థిమిత‌ప‌డ్డ రాజు ఏమ‌య్యా పెద్దాయ‌న బాట ప‌క్క‌న ఇలా మామిడి టెంక‌లు నాటుతున్నావు.ఎందుకు? అని అడిగాడు. దానికి వృద్ధుడు రాజా మామిడి మొక్క‌లు వ‌స్తాయ‌ని ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. దానికి రాజు న‌వ్వి ఈ మొక్క‌లు పెరిగి చెట్టుగా మారి మామిడి పండ్లు ఇచ్చేందుకు చాలా స‌మ‌యం ప‌డుతుంది క‌దా? అప్ప‌టి వ‌ర‌కూ నువ్వు బ‌తుకుదాం అనుకుంటున్నావా? అని అడిగాడు. ఆ ప్ర‌శ్న‌కు వృద్ధుడు కూడా న‌వ్వి రాజా నేను నా కోసం ఈ మొక్క‌లు నాట‌డం లేదు. రేప‌టి త‌రం కోసం నాటుతున్నాను. గ‌తంలో ఎవ‌రో ఇక్క‌డ మొక్క నాటారు కాబట్టే మీరు, నేను ఈ చెట్టు కింద కూర్చుని సేద‌తీరుతున్నాం. నేను కూడా అదే విధంగా రేప‌టి మ‌న పిల్ల‌ల కోసం ఈ ప‌ని చేస్తున్నా అని చెప్పాడు. వృద్ధుని దూర‌దృష్టికి, అత‌ని సేవానిర‌తికి ఆశ్చ‌ర్య‌పోయిన రాజు త‌న రాజ్యంలో మ‌రిన్ని చెట్టు నాటించే కార్య‌క్ర‌మం చేప‌ట్టాడు. ఇప్ప‌డు స్టార్ట‌ప్ లు ప్రారంభిస్తున్న ఔత్సాహికులు ఈ క‌థ నుంచి ఎంతో నేర్చుకోవ‌చ్చు. ఒక సంస్థ ప్రారంభించ‌గానే ఫ‌లితాలు వ‌చ్చేయ‌వు. ఓపిగ్గా వ్య‌వ‌హ‌రించి, నిజాయితీగా, నాణ్య‌త ప్రధాన వ‌న‌రుగా ప‌నిచేస్తే మంచి ఫ‌లితాలు వ‌స్తాయి. ఇవ్వ‌డం నేర్చుకోండి. మీకు వ‌స్తూనే ఉంటుంది. సామ‌ర్ధ్యం మేర‌కు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసి ఫ‌లితం ఎలా ఉన్నా దాన్ని తీసుకునే నైపుణ్యాన్ని సాధించాలి. సో..గివ్ ద బెస్ట్ అండ్ యు గెట్ ద బెస్ట్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేస్తున్నవారు)

 

జీతాల్లేని ఈ ఫేస్‌బుక్ కూలీలు ఏం చేస్తున్నారో తెలుసా??

 

సోష‌ల్ మీడియా..గ‌డిచిన ద‌శాబ్ద కాలంలో మాన‌వాళి జీవితాల‌ను విశేషంగా ప్ర‌భావితం చేసిన ఒక సామాజిక విప్ల‌వం. రెండు వైపులా ప‌దునున్న ఈ సామాజిక మాధ్య‌మం అనే క‌త్తితో ప్ర‌జ‌లు కూర‌గాయ‌లు కోసుకోవ‌డం మాని త‌మ గొంతుల‌తో పాటు ప‌క్క‌వాళ్ల గొంతులు కూడా తెగ్గోస్తున్నారు. ప‌క్క ఇంట్లో ఉన్న‌వాడికి కూడా అభినంద‌న‌లో, ఆప్యాయ‌త‌తో, ఆస‌రానో అందిచాల్సిన టైంలో కూడా ఒక మెసెజ్ , ఒక లైక్ ప‌డేసి మానవ సంబంధాల‌ను గొయ్యి తీసి పాతిపెట్టేస్తున్నారు. భావ వ్య‌క్తీక‌ర‌ణ పేరుతో ఫేస్‌‍బుక్ లో, ట్విట్ట‌ర్ లో పెద్ద గొంతు వేసుకుని ప‌డిపోయే న‌యా ఉత్త‌ర కుమారులు బ‌య‌ట‌కు వ‌చ్చి రోడ్డు మీద ఒక్క‌మాట కూడా మాట్లాడ‌లేని ద‌ద్ద‌మ్మ‌లుగా త‌యార‌య్యారు. ఒక మ‌నిషి ఎదురుగుండా మాట్లాడే ధైర్యం లేక‌, ఒక విష‌యం గూర్చి కూలంకుషంగా చ‌ర్చించే విజ్ఞానం లేక కామెంట్ల రూపంలో, పోస్ట్ ల రూపంలో అర‌కొత పైత్యాన్ని, ద్వేషాన్ని వెళ్ల‌గ‌క్కుతూ మాన‌సిక రోగులుగా మారిపోతున్నారు. ప‌రిస్థితి ఇలానే కొనసాగితే మానవ సంబంధాలు దెబ్బ‌తిన‌డంతో పాటు మ‌నుష్యులు మాన‌సికంగా ప‌రిణితి సాధించ‌లేని ఒక దుర్భ‌లురుగా మారిపోయే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. సోష‌ల్ మీడియా విసృతి, అది మ‌నుష్యు జీవితాల్లోకి చొచ్చుకొచ్చిన వైనం, బీట‌లు వారుతున్న బంధాలు, సామాజిక మాధ్యమాల పుణ్యమాని పెరుగుతున్న మాన‌సిక రుగ్మ‌త‌ల‌పై “కెరీర్ టైమ్స్” అందిస్తున్న ప్ర‌త్యేక విశ్లేష‌ణ.

 

 

అస‌లు ల‌క్ష్యం ఎప్పుడో నీరుగారిపోయింది!!

 

బ‌య‌ట స‌మాజంలో ఒక అన్యాయం జ‌రిగింది.. లేదా ఒక అక్ర‌మం జ‌రిగింది.. ఇది బ‌య‌ట ప్ర‌పంచానికి తెలియ‌జేయ‌డానికి మ‌న‌కు ఒక‌ప్పుడు వార్తాప‌త్రిక‌లు, వార్తా ఛానెళ్లు వంటి మెయిన్ స్ట్రీమ్ మీడియానే దిక్కు. వాళ్లు రిపోర్ట్ చేసింది విని మ‌నం ఆ సంఘ‌ట‌న‌కు సంబంధించి ఒక అభిప్రాయానికి వ‌చ్చేవాళ్లం. త‌ర్వాత సోష‌ల్ మీడియా రంగ ప్ర‌వేశం చేసింది. ఒక‌ విష‌యం లేదా సంఘ‌ట‌న జ‌రిగిన‌ వెంట‌నే అంద‌రూ త‌మ అభిప్రాయాల‌ను, అనుభ‌వాల‌ను, ప‌రిష్కార మార్గాల‌ను సోష‌ల్ మీడియాలో సూచిస్తారు. దీని వ‌ల‌న స‌మ‌స్య‌కు చాలా వేగంగా ప‌రిష్కారం దొరుకుతుంది. అయితే ఇంత అద్భుత‌మైన వేదిక‌ను విచ్చ‌ల‌విడిగా ఉప‌యోగిస్తూ, స్వీయ గుర్తింపు కోస‌, విజ్ఞాన ప్ర‌ద‌ర్శ‌నకు వాడుకోవ‌డంతో ఈ వేదిక అస‌లు ల‌క్ష్యం మెల్ల‌గా ప‌క్క‌దారి ప‌ట్టింది. దీంతో అస‌త్యాల‌ను, సొంత అజెండాల‌ను ప్ర‌చారం చేసే కొన్ని మెయిన్ స్ట్రీమ్ వార్తా సంస్థ‌ల‌కు, సోష‌ల్ మీడియా అనేది అనుబంధ సంస్థ‌గా మారిపోయింది. దీంతో సామాజిక మాధ్యమం ఆవిర్భావ ల‌క్ష్యం నీరుగారిపోయింది. ఈ విష‌యాన్ని గుర్తించ‌కుండా అవ‌స‌రానికి మించి సోష‌ల్ మీడియాలో విహ‌రిస్తూ త‌న తెలివితేట‌లను, త‌న సామాజిక బాధ్య‌త‌ను, త‌న గొప్ప‌తనాన్ని కేవ‌లం త‌న వాల్ మీదే ప్ర‌ద‌ర్శించుకుంటున్నారు.

 

 

స్వీయ గుర్తింపు కోసం పాకులాట త‌ప్ప నిబ‌ద్ధ‌త ఏది??

 

ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ లో రెచ్చిపోయేవాళ్లు, లింక్డ్ ఇన్ లో ఫోటోల‌తో హ‌ల్ చ‌ల్ చేసేవాళ్లు నిజంగా ఒక మ‌నిషి ఎదురుగా నిల్చుని మాట్లాడ‌గ‌ల‌రా? అంటే క‌చ్చితంగా లేరు అనే చెప్పాలి. ఒక నాయకుడి కోసం, అతని అవినీతి కోసం , అతని అసమర్దత కోసం ప్రతీరోజూ ఫేస్‌బుక్ లో పుంఖాపుంఖాలు రాసే మహానుభావులు ఆ నాయకుడి రోడ్డు మీద నడిచిపోతుంతే కనీసం దగ్గరగా వెళ్లేందుకు కూడా ధైర్యం చేయరు. ఎందుకు? ఎందుకంటే ఒక వ్యక్తిని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యం వీళ్లకి లేదు. తమ ఆక్రోషానికి కాస్త పైత్యాన్ని రంగరించి ఫేస్‌బుక్ లో పోస్ట్ లు పెడుతూ పేపర్ పులులుగానే మిగిలిపోతారు. వీళ్లు పెట్టిన పోస్ట్ లకు పదిమంది లైక్ కొడితేనో లేక బాగుంది అని కామెంట్ చేస్తేనో నేను సమాజానికి ఎంతో చేసాను అనుకుంటూ భ్రమల్లో బతికేస్తూ ఒక రకమైన మానసిక ధౌర్బల్యంలోకి జారిపోతున్నారు. వీళ్లకు ఎంతసేపు గుర్తించబడాలనే తాపత్రయం తప్పితే చిత్తశుద్ధితో పనిచేయాలనే విధానం ఉండదు. అవతలి వాడ్ని నోటికొచ్చినట్టు అసభ్య పదజాలంతో తిడుతూ ఒక రకమైన చెత్తను పోస్ట్ చేస్తూ దానికి మురిసిపోతూ పైగా తాను నిజమైన సామాజిక సేవకులుగా ఊహించుకుంటారు. వీళ్లలో ఒక్కరూ కూడా బయటకు వచ్చి సమస్యపై స్పందించి దాన్ని క్షేత్రస్థాయిలో పరిష్కరించాలన్న దృష్టిలో ఉండరు. ఒక వ్యక్తికి పెద్ద ఆపద వచ్చింది నాకు ప్రత్యక్షంగా సహాయం చేయండి అని ఫేస్‌బుక్ లో పోస్ట్ వస్తే ఎంతమంది ఆ బాధితుడి ఇంటికి వెళ్లి ఆ ఆపదను తీరుస్తారు. ఒక్కరూ కూడా వెళ్లరు. ఎవరిదైనా పుట్టిన రోజు రాగానే వాట్సాప్ లో మెసెజ్ , ఫేస్‌బుక్ లో ఒక గూగుల్ డస్ట్ ఫోటోను పెట్టి చేతులు దులుపుకునే వారు ఇప్పుడు ఎక్కువైపోయారు. ప్రత్యక్షంగా వెళ్లి అతనికి శుభాకాంక్షలు చెపుదాం. అనుబంధాన్ని, ఆత్మీయతను పెంచుకుందాం అనుకునే వాళ్లు ఎంతమంది?

 

 

ప్రశ్నించే ధైర్యం ఉన్నవాళ్లే విజేతలు!!

 

అణగారిన వర్గాలు, లేదా అణిచివేయబడిన వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించాలంటే ప్రశ్నించే ధైర్యం కావాలి. కానీ ఇప్పుడు చాలా మంది కేవలం సామాజిక మాధ్యమాల్లోనే ప్రశ్నిస్తున్నారు. బయటకు వచ్చి నాయకులను, అధికారులను ప్రశ్నించడం మానేసారు. ఒక నాయకుడ్ని, అధికారిని ప్రత్యక్షంగా కలిసి అతని నిలదీయలేని వారు సమాజాన్ని ఎలా మార్చగలుగుతారు. అలా అని ఒక సమస్యపై సోషల్ మీడియాలో పోస్ట్ చేయొద్దని కాదు. అలా పోస్ట్ చేయడం వలన ఆ సమస్య తీవ్రత పదిమందికి తెలుస్తుంది. ఈ పది మందితో ఫేస్‌బుక్ లో చర్చ పెట్టి కామెంట్లు చేసుకుంటూ అభిప్రాయాలను చెప్పుకుంటూ పోతే సమస్యకు పరిష్కారం రాదు. ఇప్పుడు అదే జరుగుతుంది. అధికారానికి చేరువ కావాలన్నా, సామాజిక మార్పును సాధించాలన్నా ఎవరినైనా ప్రత్యక్షంగా ఎదుర్కొనే ధైర్యాన్ని సంపాదించుకోవాలి. అలా కాకుండా సామాజిక మాధ్యమాల్లో అవాకులు, చెవాకులు వాగితే ఉపయోగం ఏముంటుంది? ఒక అన్యాయం జరిగినప్పుడు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నించాల్సిందే. కానీ అదే సామాజిక మాధ్యమాల్లో మాట్లాడుకుంటూ అక్కడే ఉండిపోతే సమస్య ఎక్కడ ఉందో అక్కడకు వెళ్లి దాన్ని పరిష్కరించేది ఎవరు? ఫేస్‌బుక్ పేపర్ పులులు ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. ఒక విషయంపై ఒక పోస్ట్ పెట్టి తన సామాజిక బాధ్యత అద్భుతం అంటూ తనలో తానే మురిసిపోయి ఒక రకమైన మానసిక రుగ్మతకు లోనవుతున్నారు.

 

 

“గుడ్ మార్నింగ్” , “గుడ్ నైట్” బ్యాచ్ ను వదిలించుకోండి!

 

ఇప్పుడు వాట్సాప్ లో కొత్త రకం వ్యక్తులు తయారయ్యారు. ఉదయం లేవగానే తన ఫోన్ బుక్ లో ఉన్నవారందరికీ ఒక గుడ్ మార్నింగ్ మెసెజ్ పెడతారు. తన పక్కనే ఉన్న తన భార్యకో, తన ఆత్మీయులకో గుడ్ మార్నింగ్ చెప్పరు కానీ ఇలా వాట్సాప్ లలో గుడ్ ‌మార్నింగ్ లు చెపుతారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు చెపుతారు. వీళ్లలో ఒక్కరు కూడా తన ఫ్రెండ్ ను ప్రత్యక్షంగా కలిసి విషెస్ చెప్పరు. వాట్సాప్ ఒక మెసెస్ టైప్ చేసి చేతులు దులుపుకుంటారు. కనీసం ఫోన్ చేసి అయినా వాళ్లతో మాట్లాడాలి అన్న ఇంగితం కూడా మర్చిపోయారు. దీనికి తోడు ఒక వాట్సాప్ మెసెజ్ రాగానే వెనుకా ముందా చూడకుండా అందరి ఫ్రెండ్స్ కు ఫార్వార్డ్ చేసేయడం. తాము తమకు తెలియకుండా అబద్ధాలను ప్రచారం చేసే వాహకాలుగా పనిచేస్తున్నామన్న సోయ కూడా ఎప్పుడో మర్చిపోయారు. ఒక మెసెజ్ రాగానే అందులో నిజమెంత? అందులో ఎవరి ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి. ఈ మెసెజ్ వలన వచ్చే పరిణామాలేంటి? అన్న విషయాలు ఆలోచించకుండా ఉన్నత విద్యావంతులు కూడా మెసెజ్ లను ఫార్వార్డ్ చేస్తున్నారు. ఎంతసేపూ ఫార్వార్డ్ మెసెజ్ లు చేసి చేసీ సొంతంగా ఆలోచించే శక్తిని కోల్పోతున్నారు. ఒక విషయంపై తన సొంత అభిప్రాయాలను రాసి దానిపై విమర్శలను కూడా స్వీకరించే స్థాయి ఎంత మందికి ఉంది. ఒక అద్భుతమైన మాధ్యమాన్ని దుర్వినియోగం చేయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ తన ఒక్కడికే పరిమితం అనుకోవడం, తాను చేసిందే కరెక్ట్ అనుకోవడం వంటి అవలక్షణాలను పెంచుకుంటున్నారు.

 

 

ఈ ఫేస్‌బుక్ కూలీలతో ఈ సమాజానికి పైసా ఉపయోగం లేదు!

 

ఫేస్‌బుక్ అనేది ఇప్పుడు ప్రపంచంలోనే లాభసాటి సంస్థ. దాని వ్యవస్థాపకుడు ఇప్పుడు కొన్ని లక్షల కోట్లకు అధిపతి. విచిత్రం ఏమిటంటే ఫేస్‌బుక్ ఇలాంటి అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లను చాలా మందిని తయారు చేసింది. వీళ్లనే ఇప్పుడు ఫేస్‌బుక్ కూలీలు అని కూడా అంటారు. వీళ్లకి ఫేస్‌బుక్ ఒక పైసా కూడా ఇవ్వదు. వీళ్లు మాత్రం కంటెంట్ రాసి ఫేస్‌బుక్ కు ఆదాయం సమకూరుస్తారు. నిరంతరం ఫేస్‌బుక్ లో విహరించే ఈ అన్‌పెయిడ్ ఆర్టిస్ట్ లే వాళ్లకు ఆస్తి. నిజంగా పనిచేసే వాళ్లు , సమస్యపై స్పందించేవాళ్లు ఫేస్‌బుక్ లో ఒక పోస్ట్ పెట్టి వెంటనే రంగంలోకి దిగిపోతారు. అంతేకానీ ఫేస్‌బుక్ లో చర్చకు దిగరు. తమ స్వీయ గుర్తింపు కోసం పాకులాడరు. పెద్ద బిజినెస్ మ్యాన్‌లు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించండి. వాళ్లు ఎప్పుడూ సోషల్ మీడియాలో పరిమితంగానే ఉంటారు. క్షేత్ర స్థాయిలో తాము చేసిన పనిని మాత్రమే అందులో ప్రస్తావిస్తారు. క్రేజ్ ఉన్న ఒక హీరోను తిడుతూ ఒకడు, పొగుడుతూ మరొకడు తాము పాపులర్ కావాలని తాపత్రయపడుతూ ఉంటారు. తమ సొంత ప్రతిభతో ఆ పాపులారిటీని సంపాదించుకోవాలని ఒక్కరోజూ అనుకోరు. పాపులారిటీ, గుర్తింపు అనేది చేసే పని, నిజాయితీ, కష్టించే మనస్తత్వం వలన వస్తుంది. ఇలా సోషల్ మీడియాలో సొంత అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ, వాల్ మీద మాత్రమే సామాజిక బాధ్యతను నిర్వర్తించే వాళ్లకు దూరంగా ఉండండి. వీళ్ల వలన దేశానికే కాదు మీకు కూడా ఎటువంటి ఉపయోగం లేదు. బీ కేర్ ఫుల్.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్  చేస్తున్నవారు) 

 

 

బాగా కిక్ ఇచ్చే డ్రగ్స్ ఏంటో తెలుసా?

 

 

ఇప్పుడు మ‌న దేశంలో మాద‌క ద్ర‌వ్యాలు అతిపెద్ద స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించాయి. మాద‌క ద్ర‌వ్యాల‌కు బానిస‌లుగా మార‌డంతో ఉత్సాహంతో ఉర‌క‌లెత్తాల్సిన యువ‌త, జ‌వ‌స‌త్వాలు ఉడిగి య‌వ్వ‌నంలోనే శారీరకంగా మానసికంగా నిర్వీర్వ‌మైపోతున్నారు. పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఏకంగా కుటుంబాల‌కు కుటుంబాలే నాశ‌న‌మై ఆ రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ కుప్ప‌కూలిపోయే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌భుత్వాలు ఎన్ని ఊక‌దంపుడు ఉప‌న్యాసాలు ఇచ్చినా మ‌న దేశంలో ఇప్ప‌టికీ మాద‌క ద్ర‌వ్యాలు సులువుగానే దొరుకుతున్నాయి. ఒకవైపు దేశానికి వెన్నుముక లాంటి యువ‌త మాద‌క‌ద్ర‌వ్యాల సేవ‌నంతో ప‌త‌న‌మ‌వుతుంటే మ‌రోవైపు పాల‌కులు మాత్రం ఇంకా నిషేధం అన్న ద‌గ్గ‌రే నిలిచిపోయారు. అయితే మాదక ద్ర‌వ్యాలపై ఎప్ప‌టి నుంచో నిషేధం ఉన్న‌ప్ప‌టికీ అవి యువ‌త‌కు ఎలా అందుబాటులోకి వ‌స్తున్నాయి? అస‌లు అన్నింటికంటే ముఖ్యంగా కేవ‌లం మాద‌క ద్ర‌వ్యాల‌ను నిషేధిస్తే ఈ పెను స‌మ‌స్య ప‌రిష్కార‌మైపోతుందా? అన్న ప్ర‌శ్న‌లు అతిపెద్ద చ‌ర్చ‌నీయాంశాలు. ఈ నేపథ్యంలో మాద‌క ద్ర‌వ్యాలు, యువ శ‌క్తిపై “కెరీర్ టైమ్స్” ప్ర‌త్యేక విశ్లేష‌ణ‌.

 

 

నిషేధం అన్న ప‌ద‌మే అతిపెద్ద మాద‌క‌ద్ర‌వ్యం!!

 

మ‌నిషి ఆలోచ‌నా విధానం, మాన‌సిక ప‌రిప‌క్వ‌త‌, వికాసం అన్న‌వి అత్యంత సంక్లిష్ఠ‌మైన విష‌యాలు. మానసిక శాస్త్ర‌వేత్త‌ల అధ్య‌య‌నాల ప్ర‌కారం ఫలానా ప‌నిచేయొద్దు..ఫ‌లానా వ‌స్తువును తినొద్దు…ఫ‌లానాది తాకొద్దు, చూడొద్దు..అంటూ నియంత్ర‌ణ‌లు విధిస్తే ఎట్టి ప‌రిస్థితుల్లోనైనా ఆ ప‌ని చేయాల‌ని..వ‌ద్దు అన్న‌దాన్నే తినాల‌ని..తాకొద్దు అన్నదాన్నే తాకాల‌ని..చూడొద్దు అన్న దాన్నే చూడాల‌ని మ‌నిషి మ‌న‌స్సు ఉబ‌లాట‌ప‌డుతుంది. ముఖ్యంగా నియంత్ర‌ణ విధించిన ఆ ప‌నులపై అర‌కొర స‌మాచారం, త‌ప్పుడు స‌మాచారం వాటిపై మ‌రింత ఆక‌ర్ష‌ణ పెరిగేలా చేస్తుంది. దీంతో వాటిని ఎలాగైనా తినాల‌ని, వాటిని సాధించి అందులోని మ‌జాను ఆస్వాదించాల‌ని మ‌న‌స్సు ఉవ్విళ్లూరుతుంది. మాద‌క ద్ర‌వ్యాల విష‌యంలో ఇప్పుడు స‌రిగ్గా ఇలానే జ‌రుగుతోంది. వాటికి నిషేధం అన్న ముసుగు వేయడంతో ఆ ముసుగు వెన‌కాల అద్బుత‌మైన ఆనందం దాగి ఉంద‌ని యువ‌త‌ను పెడ‌దారి ప‌ట్టించే అరాచ‌క శ‌క్తులు ఎక్కువైపోయాయి. దీంతో యువ‌త డ్ర‌గ్స్ ఏదో అద్భుతం దాగి ఉంద‌న్న ఆక‌ర్ష‌ణ‌తో జీవితాల‌ను స‌ర్వ నాశ‌నం చేసుకుంటున్నారు.

 

 

మ‌న రోజువారీ జీవితంలోనూ మాద‌క ద్ర‌వ్యాలు ఉన్నాయి!

 

మ‌న రోజూవారీ జీవితంలో మాద‌క ద్ర‌వ్యాలు ఉండ‌ట‌మేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అవును మీరు చ‌దివింది నిజ‌మే. అస‌లు మాద‌క ద్ర‌వ్యం అంటే ఏమిటి? ఒక ప్ర‌త్యేక‌మైన రసాయ‌నాన్ని శ‌రీరంలోకి ఎక్కించుకుని అది అందించే మ‌త్తులోకి జారిపోవ‌డ‌మే క‌దా? మాద‌క ద్రవ్యాలు అంటే కొకైన్, హెరాయిన్, గంజాయి వంటివే కాదు ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో వాడే కొన్ని ర‌కాల మందులు కూడా మాద‌క ద్ర‌వ్యాలు కింద‌కే వ‌స్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు షుగ‌ర్ పెషెంట్ల‌కు వాడే కొన్ని ర‌కాల ముందులను డ్ర‌గ్స్ గానే ప‌రిగ‌ణించాలి. అంటే ఆరోగ్యానికి చేటు చేస్తాయ‌ని కాదు. మ‌నిషి ఆ ముందులు వేసుకోవ‌డానికి అల‌వాటు ప‌డి స‌హ‌జ సిద్ధంగా శారీర‌క వ్యాయామం చేసి మంచి స‌మ‌తుల ఆహారం తీసుకుని జీవ‌నశైలిని మార్చుకుని షుగ‌ర్ ను అదుపులోకి తెచ్చుకుందాం అన్న ఆలోచ‌న మ‌ర్చిపోతున్నాడు. కేవ‌లం ఆ డ్ర‌గ్స్ ను శ‌రీరంలో వేసుకుని వాటికి అల‌వాటు ప‌డి అందులోనే జోగుతున్నాడు. అలాగే ప్ర‌స్తుతం మ‌నిషి జీవితాల‌ను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తున్న స్మార్ట్ ఫోన్, సోష‌ల్ మీడియా వంటి వాటిని కూడా మాద‌క ద్ర‌వ్యాలు గానే ప‌రిగ‌ణించాలి. అవి లేకుంటే ఒక్క‌క్ష‌ణం కూడా మ‌నుగ‌డ సాగించలేని మ‌న బ‌ల‌హీత‌నను డ్ర‌గ్స్ సేవ‌నంతో స‌మాన‌మైన వ్య‌స‌నంగానే చూడాల్సి ఉంటుంది.

 

 

నిషేధంతో మాద‌క ద్ర‌వ్యాల క‌ట్ట‌డి సాధ్యం కాదు!

 

నిషేధం విధిస్తేనో లేక నియంత్రిస్తేనో మాదక ద్ర‌వ్యాల స‌మ‌స్య అంతం కాదు. ఎందుకంటే వాటిని దొంగ దారిలో యువ‌త‌కు చేర‌వేసే ఆరాచ‌క శ‌క్తులు లెక్క‌కు మించి ఉన్నాయి. నిషేధం అనేది ఎప్ప‌టికీ స‌త్ఫ‌లితాల‌ను ఇవ్వ‌దు. ఇప్పుడు ప్ర‌భుత్వాలు చేయవ‌ల‌సిన ప‌ని నిషేధంతో పాటు స‌మ‌స్య మూలాల్లోకి వెళ్లి దాన్ని తొలిగించే ప్ర‌య‌త్నం చేయ‌డం. పాఠ‌శాల స్థాయి నుంచే పిల్ల‌ల‌కు ధ్యానం, యోగా, కుటుంబ విలువ‌లు, శారీర‌క, మానసిక ఆరోగ్యాల ప్రాధాన్య‌త‌ను వివ‌రిస్తే అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తాయి. ధ్యానం చేయడం ద్వారా ల‌భించే అలౌలిక ఆనందం ముందు డ్ర‌గ్స్ అందించే మ‌త్తు బ‌లాదూర్. దీంతో క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో పిల్ల‌ల‌ను సుక్షితులుగా త‌యారు చేయాలి. ఇటు త‌ల్లిదండ్రులు కూడా డ‌బ్బు సంపాద‌నే ల‌క్ష్యంగా కాకుండా త‌మ పిల్ల‌ల‌కు త‌గిన స‌మ‌యం కేటాయించి వారి పెంప‌కంలో త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. వారి అల‌వాట్లు, ప్ర‌వ‌ర్త‌న పై త‌గు నిఘా ఉంచి అదే స‌మ‌యంలో వారికి ధ్యానం, మ‌న‌స్సుని నియంత్రించే విష‌యాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు చెపుతూ ఉండాలి. తాత్కాలిక ఆనందాలు, సుఖాలు త‌ర్వాత జీవితాన్ని ఎంత‌గా ప్ర‌భావితం చేస్తాయో, ఎటువంటి ప‌త‌నావ‌స్థ‌కి చేరుస్తాయో వారికి స‌రైన ప‌ద్ధ‌తిలో వివ‌రించాలి. ముఖ్యంగా విలువ‌ల‌తో కూడిన పెంప‌కాన్ని అందించాలి.

 

 

న‌మ్మ‌కంలోని మజాతో జీవితానికి కొత్త చిగురులు!

 

ఒక రోగి తీవ్ర‌మైన శారీర‌క రుగ్మ‌త‌తో డాక్ట‌ర్ ద‌గ్గ‌ర‌కు వెళ్లాడు. అత‌న్ని క్షుణ్ణంగా ప‌రీక్షించిన డాక్ట‌ర్ ఇంకో మూడు నెల‌లు మించి మీరు బ‌త‌కడం సాధ్యం కాద‌ని రోగికి స్ప‌ష్టం చేసారు. దీంతో ఆ రోగి మాన‌సికంగా మ‌రింత‌గా దిగ‌జారిపోయాడు. అత‌ను ఎంత‌గా దిగ‌జారిపోయాడంటే క‌నీసం డాక్ట‌ర్ చెప్పిన మూడు నెల‌లైనా బ‌తుకుతాడా? అన్న సందేహం అంద‌రికీ క‌లిగింది. ఇటువంటి ప‌రిస్థితుల్లో ఆ రోగిని ప‌రామ‌ర్శించేందుకు అత‌ని స్నేహితుడు హాస్పిట‌ల్ కు వెళ్లాడు. వృత్తిరీత్యా సైకాల‌జిస్ట్ అయిన రోగి స్నేహితుడు అత‌ని ప‌రిస్థితిని గ‌మ‌నించాడు. అత‌నికి శారీర‌క స‌మ‌స్య కంటే మానసిక స‌మ‌స్య అధికంగా ఉన్న‌ట్టు గుర్తించాడు. త‌న స్నేహితుడ్ని హాస్ప‌ట‌ల్ నుంచి ప్ర‌కృతికి ప్ర‌శాంత‌త‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఒక ఇంట్లోకి మార్పించాడు. అత‌ని మంచం ప‌క్క‌నే కిటికీ ఉండేట‌ట్టు చూసి అక్క‌డ ఒక మొక్క‌ను నాటాడు. అప్పుడు ఆ రోగితో ఇలా చెప్పాడు. “ఇప్పుడు ఇక్క‌డ ఒక మొక్క‌ను నాటాను. ఈ మొక్క ఆరోగ్యంగా ఎదిగితే నువ్వు కూడా నీ జ‌బ్బు నుంచి బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టే. ఒకవేళ మొక్క చ‌నిపోతే నువ్వు కూడా తొంద‌ర‌గా చ‌నిపోతావ్” అని చెప్పాడు. ఆ రోగి ప్ర‌తిరోజూ ఉద‌యం లేవ‌గానే ఆ మొక్క వంక ఆశ‌గా చూసేవాడు. ఆ మొక్క మెల్ల‌గా ఆకులు, పూలు కాస్తూ ఏపుగా పెరుగుతోంది. రోగిలో ఆనందం పెరిగింది. త‌న మొక్క ఎంత బాగా పెరుగుతుంది అన్న ఆనందంలో అత‌ను త‌న జ‌బ్బు సంగ‌తే మ‌ర్చిపోయాడు. ఆరోగ్యంగా పెరిగిన ఆ మొక్క‌లానే అత‌ను కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. వాస్త‌వానికి మొద‌ట నాటిన మొక్క తొలిరోజే చ‌చ్చిపోయింది. కానీ రోగికి తెలియ‌కుండా అతని ఒక కొత్త మొక్క‌ను నాటి దానికి త‌గిన నీరు, ఎరువులు వేసి అది బాగా ఎదిగేలా చూసుకున్నాడు. మొక్క బాగా పెరుగుతుంద‌న్న సంతోషంలో రోగి కూడా ఆరోగ్యంగా త‌యార‌య్యాడు. ఈ క‌థ‌లో నీతి ఏంటి మ‌నలోని న‌మ్మ‌కం, ఆనంద‌మే మ‌న స్థితిని నిర్ణ‌యిస్తాయి. అయితే ఆ ఆనందాన్నిఏ విధంగా సంపాదించుకుంటామ‌న్న‌దే ముఖ్యం. మాద‌క ద్ర‌వ్యాలు తీసుకుని, తాత్కాలిక ఆనందాల కోసం వెంప‌ర్లాడితే ఆనందం, ఆరోగ్యం రెండూ దూర‌మ‌వుతాయి.

 

 

మాద‌క ద్ర‌వ్యాల కంటే కిక్ నిచ్చే సాధ‌నాలున్నాయి!!

 

మాద‌క ద్ర‌వ్యాలు, మ‌ద్య‌పానం కిక్ నిస్తున్నాయి కాబ‌ట్టి వాటిని సేవిస్తున్నారు. ఆ కిక్ కోస‌మే ఆరోగ్యం పాడుచేసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు. కొంద‌రు వాదిస్తారు. కానీ వాస్త‌వానికి వాటి కంటే కిక్ నిచ్చే విష‌యాలు ఎన్నో ఉన్నాయి. ఒక గంట‌సేపు క‌ద‌ల‌కుండా ఒకచోట కూర్చుని , ఒక విష‌యంపై శ్ర‌ద్ధ పెట్టి త‌దేకంగా ధ్యానం చేస్తే వ‌చ్చే కిక్ ఎన్ని మాద‌క ద్ర‌వ్యాలు తీసుకున్నా రాదు. అలాగే ఒక మంచి ప‌ని చేసిన‌ప్పుడు, సాటి మ‌నిషికి ఉపకారం చేసిన‌ప్పుడు, ఆక‌లితో అల‌మ‌టిస్తున్న పేద‌వాళ్ల‌కు క‌డుపునిండా అన్నం పెట్టిన‌ప్పుడు వ‌చ్చే కిక్ ఎంతో బాగుంటుంది. ఇటువంటి విష‌యాల‌ను ప్ర‌తీ విద్యార్ధికి అటు త‌ల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులు చిన్న‌త‌నం నుంచి చెప్ప‌గ‌ల‌గాలి. ఇక ప్ర‌భుత్వాలు కూడా మాద‌క ద్ర‌వ్యాల వంటి పెను స‌మ‌స్య‌ల‌కు నిషేధం అన్న ప‌రిష్కారం మార్గం ద‌గ్గ‌ర ద‌గ్గ‌రే ఆగిపోకుండా స‌మ‌స్య మూలాల‌ను అర్ధం చేసుకుని , విలువలు, క్ర‌మ‌శిక్ష‌ణ‌, స్వీయ‌నియంత్ర‌ణ వంటి విష‌యాల్లో విద్యార్ధులకు మ‌రింత శిక్ష‌ణ ఇచ్చేందుకు విద్యా విధానంలో త‌గిన మార్పులు చేయాలి. అప్పుడు డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారి ఎటువంటి నిషేధం అవ‌స‌రం లేకుండానే మ‌న దేశాన్ని వీడిపోతుంది.

 

(ఈ ఆర్టికల్ ను మీకు స్పాన్సర్ చేసినవారు)